పరాశక్తి యొక్క అత్యున్నత రూపం, ఆమె కామేశ్వరి, త్రిపుర సుందరి, మరియు రాజరాజేశ్వరిగా ప్రసిద్ధి.

శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీ పుంస యోగోద్భవాం
తే వేదత్రయ మూర్తయ స్త్రిపురుషా స్సంపూజితావ స్సురై:
భూయాసు: పురుషోత్తమాంబుజ భవశ్రీకంధరా: శ్రేయసే |

తాత్పర్యం: లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి లను, రొమ్ము, ముఖము, శరీరముల యందు ధరించుచు, స్త్రీ పురుష యోగోద్భవంగా లోకముల స్థితిని ఎడము లేనిదిగా చేయుచున్నవారు, వేదత్రయ మూర్తులు, దేవతలతో పూజింపబడే వాళ్ళు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే త్రిపురుషులు మనకు శ్రేయస్సు, ఇచ్చేవారు అగుదురు గాక.

శ్రీ  లలితా  త్రిపుర  సుందరి  దేవస్థానం  ట్రస్ట్
ప్రతి చండీ పారాయణము, హోమ హవనముల




ఆలయ చరిత్ర

ఆలయ వ్యవస్థాపకుని మాటల్లో

మన భరతమాత పుణ్యవతి. సృష్ట్యాదియందు పరమేశ్వరుని ఉఛ్వాస నిశ్వాసము లైన నిగమ ఆగమములు (వేదములు ) బ్రహ్మ ముఖమునుండి వాఙ్మయ రూపములో ధ్వనించిన శబ్దమును మంత్ర ద్రష్టలు వారి దర్శనా శక్తిచే గ్రంథస్థము చేసిరి. ఇవి అపౌరుషేయములు. ఎవరు స్వయముగా రచించినవి కావు. ఇటువంటి వేదము అనాది నుండి పరంపరగా ఈ పుణ్య భూమియందు శృతి రూప ఝరిగా ప్రవహిస్తూ వచ్చుచున్నది. ఈ వేదము నుండి అనేక ధర్మములు స్మృతులు పురాణములు ఉద్భవించినవి. ఈ సనాతన ధర్మమే నేటి వరకు అవిఛ్చిన్నముగా హిందువుల మదిలో నిగూఢమై కొనసాగుచున్నది. ఈ సనాతన ధర్మమునకు హాని కలిగి అధర్మము పెచ్చుమీరినపుడు పరమాత్మ తనకు తానుగా అవతారమొంది ధర్మమును రక్షించెను. పరమాత్మ అని అన్నచో అది పురుషుడా ? స్త్రీ యా ? అని సందేహము రావొచ్చు. ఆ శక్తి ఏ రూపములో వచ్చినను దానికి ధర్మ రక్షణే ప్రధాన కర్తవ్యము. అట్టి ధర్మ రక్షణ విషయములో ఆ శక్తి లలితా రూపమైన స్త్రీ మూర్తిగా యజ్ఞ కుండమందు ఆవిర్భవిoచి తన అనంత శక్తులచే రాక్షస సంహారము గావించి దేవతలను కాపాడి మానవ లోకమునకు కల్యాణ కారి అయినది. ఆమెను లలిత పరాభట్టారిక అని బ్రహ్మాండ పురాణము ఉటంకించినది. ఈమె జగజ్జనని. సృష్టికి మూలమైన ఆది శక్తి. అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ. త్రిమూర్తులకు కూడా ఈమె రక్షకురాలని శ్రుతులు గుర్తించినవి. ఇపుడు మన ఉపాస్య దైవము ఆ లలితా పరాభట్టారికయే. సకల ఉపనిషత్తులలో చెప్పబడిన తల్లి. న మాతు: పరదైవతం. కనుక ఆ తల్లిని ఉపాసించుట లేదా కొలుచుట మన ప్రధమ కర్తవ్యము.

ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామం నందు భరద్వాజస గోత్ర మొలకనాడు కృష్ణ యజుర్వేదీయ తైత్తి రీయ శాఖ యందు వెంకట సుబ్బయ్య శర్మ గా జన్మించిన నేను బద్వేలు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ అయలా వజ్ఝల రామకృష్ణ శాస్త్రి గారి వద్ద షోడశ స్మార్త కర్మలు అధ్యయనం చేసి ఉభయ శాఖ ప్రయోక్త గా కర్నూలు పట్టణ కంచి కామకోటివారి శంకర మందిరము నందు అర్చకుడిగా యున్న కాలమున సుందర స్వప్నమందు లలితా దేవి, కంచిపరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి దివ్యరూపమును గాంచి ఆశ్చర్య చకితుడనై మేలుకాంచి ఆ రూపములో అమ్మను సేవించ నిశ్చయించి కర్నూలు డాక్టర్స్ కాలనీ పార్థ సారధి నగర్ నందు 1996 వ సంవత్సరము లో ఒక చిన్న మందిరము నిర్మించి విశ్వేశ్వరునికి కూడా గుడి కట్టించి అనేక చండీ యాగములు, రుద్రాభిషేకములు చేస్తూ ప్రస్తుతము ప్రతి నిత్యము శ్రీ చక్ర నవ ఆవరణార్చన చేయుచున్నాను. ఇచటికి వచ్చు భక్తులకు ఆ తల్లి కొంగు బంగారమై విరాజిల్లుచున్నది. అనేక ఆత్మీయ భక్తుల సహకారముతో ఈ యజ్ఞ క్రతువులు నిర్వహిస్తూ వైదిక సేవ చేస్తున్నాము. ఈ దేవస్థానము సమస్యలతో కొట్టుమిట్టాడు భక్తుల జాతకచక్రములు పరిశీలించి వారికి అనువైన వైదిక యజ్ఞములు చేయిస్తూ ఎందరికో సమస్యల ఉపశమనము కల్గించు చున్నది. ప్రతినిత్యము జరుగు సేవల నిమిత్తము మరియు వ్యక్తిగత సమస్యల కొరకు ఈ విషయమును అందరికీ తెలిపి ప్రజాదరణ పొందాలన్నది మా ఉద్దేశ్యము.

ఈ సంకల్పములకు నాకు మార్గదర్శకం ఆదిశంకరాచార్యుల సాహిత్యం. శివానంద లహరి నా మొదటి పఠిత, ఆచరిత గ్రంధము. అది నా జీవితములో ఎన్నో దివ్యానుభూతులను ఆవిష్కరించింది. ఆయనే నా గురువు దైవము. అటువంటి మహనీయునిచే స్థాపించబడిన చతురామ్నాయ పీఠములలో ముఖ్యమైనది దక్షిణామ్నాయ శృంగేరి జగద్గురు పీఠ పరంపరలో 36 వ, 37 వ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి కరకమల సంజాతులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖరభారతి స్వాముల ఆశీస్సులతో ప్రస్తుతము ఇచట కార్యక్రమములు నిర్వహించబడుచున్నవి ఆ పీఠమునకు అనుబంధ ధర్మ ప్రచార సంస్థగా అహం బ్రంహస్మి ఛానల్ వారు మన దేవస్థానమును వేదికగా ఎంచి యువ విద్వాంసులచే ధర్మ ప్రచారము చేస్తున్నారు. ఇది ఎంతో ముదావహము. ఇది జగద్గురువుల ఆశీర్వచనం.

ఈ దేవస్థానము నందు ప్రతీ నిత్యమూ శ్రీ చక్ర నవ ఆవరణార్చన సాయంత్రం ప్రదోష సమయములో మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్ర అభిషేకములు జరుగును. నైమిత్తికముగా ప్రతి పర్వ దినమును పురస్కరించుకుని ఆయా దేవతల అనుష్ఠానము జరుగును. ఆరోగ్యము అదృష్టము కొరకు ప్రతీ ఆదివారము అరుణ హోమము నిర్వహించబడును. ఇంకా ఇచట జరిపించు ముఖ్య కార్యక్రమములు




శ్రీ లలితా దేవి
శ్రీ లలితా దేవి
శ్రీ లలితా దేవి
శ్రీ లలితా దేవి
శ్రీ లలితా దేవి

దేవాలయ వ్యవస్థాపకులు


Mokshagundam Venkata Subbaiah Sharma

Mokshagundam Venkata Subbaiah Sharma

Chairman

General Secretary
Dharmavaram Sunil Kiran Sharma

Dharmavaram Sunil Kiran Sharma

Dharmavaram Sunil Kiran Sharma

General Secretary

--------------

J Y Krishna Reddy

J Y Krishna Reddy

-




సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

97031 66564
- మోక్షగుండం వెంకట సుబ్బయ్య శర్మ

90000 01979
- ధర్మవరం సునీల్ కిరణ్ శర్మ

94407 24968
- జె వై కృష్ణా రెడ్డి

Book for Puja

Name of the Donor
Gotram
Mobile Number
e-Mail
UTR Number after Payment
Date of Payment
Amount Donated
Event
Date of Event/ Puja